ఎస్ ఎస్ రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న SSMB 29 చిత్ర షూటింగ్ వివరాలేమీ అధికారికంగా ప్రకటించకపోయినా ఆ విషయాలు ఎప్పటికప్పుడు లీకవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కి సంబందించిన కొన్ని సీన్స్ లీక్ అవ్వగా.. ఆ రాష్ట్ర మినిస్టర్స్ ఇలాంటి ఓ భారీ సినిమా షూటింగ్ తమ రాష్ట్రలో జరగడం తమకి గర్వకారణమన్నారు.
ఇప్పుడు SSMB 29 కెన్యా షెడ్యూల్ షూటింగ్ అప్ డేట్ ని ఆ దేశ ఫారిన్ ఎఫైర్స్ సెక్రటరీ రివీల్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది. రాజమౌళి అలాగే నిర్మాత, కార్తికేయలు కెన్యా SSMB 29 షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో.. ఆ దేశ ఫారిన్ ఎఫైర్స్ సెక్రటరీని మర్యాద పూర్వకంగా కలిశారు...ఆ తర్వాత ఫారిన్ ఎఫైర్స్ సెక్రటరీ SSMB 29 పై అధికారికంగా వేసిన ట్వీట్ లో చాలా విషయాలు రివీల్ అయ్యాయి.
అందులో ముఖ్యంగా SSMB29 వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది, 120 మంది క్రూ తో కెన్యా షెడ్యూల్ షూటింగ్ జరిగింది, అంతేకాకుండా ఆఫ్రికాలో చేసే సీన్స్ 95% కెన్యాలో షూటింగ్ జరుపుకుంటుంది అంటూ ఆయన చేసిన ట్వీట్ లో బోలెడన్ని విషయాలు రివీల్ చేసారు. ఈ షెడ్యూల్ లో మహేష్, ప్రియాంక చోప్రా, పృథీరాజ్ సుకుమారన్ లు అలాగే కీలక నటులు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది.