సూపర్ స్టార్ మహేష్-దర్శకధీరుడు రాజమౌళి కలయికలో క్రేజీ పాన్ ఇండియా కాదు కాదు పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న SSMB29 పై ఉన్న క్రేజ్, అంచనాలు కొలమానంలో కొలవడం కష్టమే. SSMB29 అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి నవంబర్ లో అసలు సిసలు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా రాజమౌళి ప్రకటించారు.
కానీ SSMB29 పై ఏ చిన్న న్యూస్ బయటికి వచ్చినా అది సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. తాజాగా రాజమౌళి-మహేష్ ఇంకా ప్రియాంక చోప్రా, మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కెన్యాలో ఉన్నారు. అక్కడ ఆఫ్రికా అడవుల్లో SSMB29 షూటింగ్ జరుగుతుంది. అందుకు సంబందించిన అప్ డేట్ లేకపోయినా టీమ్ మొత్తం అక్కడే ఉంది.
ఇక ఇప్పుడు SSMB29 పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది తెలుగు సినిమా ని అంతర్జాతీయ స్థాయి కి తీసుకెళ్లే విధంగా రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న SSMB29 ని ఏకంగా 120 దేశాల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు అన్న వార్త సన్సేషనల్ అయ్యింది. అందుకే రాజమౌళి GlobeTrotter హ్యాష్ ట్యాగ్ ని సెట్ చేసారంటూ మాట్లాడుకుంటున్నారు.