ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ మరణానంతరం చెల్లి పాదయాత్ర తో లాభపడి సీఎం కుర్చీ ఎక్కి ఆ తర్వాత చెల్లిని ఆస్తుల వ్యవహారంలో మోసం చెయ్యడంతో షర్మిల అన్న మీద కక్షతో తెలంగాణ వచ్చి పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆతర్వాత ఏపీపై దృష్టి పెట్టి అప్పుడప్పుడు యాక్టీవ్ గా కనిపించే ఆమెని ఆఖరికి ఏపీ కాంగ్రేస్ కార్యకర్తలు కూడా నమ్మని పరిస్థితిలో ఉంది ప్రస్తుత వ్యవహారం.
ఇప్పుడు అలానే కెసిఆర్ బిడ్డ కవిత పరిస్థితి కూడా అవుతుందా అనేది ఎవ్వరూ అంచనా వెయ్యలేని పరిస్థితి. కారణం పదేళ్లు తండ్రి సీఎం గా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎదిగి దొరికిందంతా పోగేసి చివరికి లిక్కర్ కేసులో జైలుకెళ్లి కొన్ని నెలల పాటు జైల్లోనే ఉన్న కవిత బెయిల్ పై రాగానే బీఆర్ఎస్ నేతల్లో కొంతమందిని టార్గెట్ చేసింది.
ముఖ్యంగా హరీష్ రావు ని సంతోష్ రావు ని డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యడంతో తండ్రి కేసీఆర్ కూతురు కవిత ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దానితో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కవిత కొత్త పార్టీ పెడుతుంది అని కొంతమంది, కాదు కాంగ్రెస్ లో కవిత చేరిక ఉంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి తండ్రి చాటు బిడ్డగా, అన్న చాటు చెల్లెలిలా కవిత ఇప్పటివరకు కనిపించినప్పటికీ ఇప్పుడు తెగించి ఇప్పుడు ఒంటరి పోరుకు సిద్ధమైంది.
కవిత కూడా షర్మిల లా అవుతుందా, లేదంటే పోరాడి గెలుస్తుందా అనేది కాలమే తేల్చాలి.. కానీ రాజకీయ రణరంగంలో కవిత పరిస్థితి ఏమిటి అనేది కూడా ఈరోజు ఆమె పెట్టబోయే ప్రెస్ మీట్ తెలుస్తుంది.