సెలబ్రిటీ జీవితం ప్రారంభం కాకముందు కొందరి వృత్తి ఆశ్చర్యపరుస్తుంది. చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ ఇక్కడ డాక్టర్ అయ్యాక యాక్టర్ అయ్యింది ధనశ్రీ వర్మ. క్రికెటర్ హబ్బీ యజ్వేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకున్న ధనశ్రీ తాజాగా కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ ఫరాఖాన్ తో ఇంటర్వ్యూలో తన లైఫ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలను రివీల్ చేసారు.
తాను నటి, కొరియోగ్రాఫర్ కాక మునుపు డెంటిస్టుగా మూడేళ్ల పాటు బాంద్రాలో క్లినిక్ నడిపానని ధనశ్రీ వెల్లడించింది. తన క్లినిక్ కి స్టార్ హీరో రణబీర్ కూడా ఓసారి వచ్చారు. అతడి దంతాలకు చికిత్స అందించాను అని ధనశ్రీ తెలిపారు. అవునా అతడి నోట్లోకి చూశావా? అది ఎలా ఉంది? డిఫరెంటుగా ఉందా? అంటూ ఛమత్కారంగా నవ్వుతూ అడిగారు ఫరా. దీనికి స్పందిస్తూ.. అది నా వృత్తి.. అయినా దంతాల ఆరోగ్యం చాలా మంచిది.. పరిశుభ్రత ముఖ్యం! అని అన్నారు.
తన క్లినిక్ కి చాలామంది సెలబ్రిటీలు చికిత్స కోసం వచ్చేవారని కూడా ధనశ్రీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు ప్రాజెక్టులతో బిజీగ ఉంది. టాలీవుడ్ లో `ఆకాశం దాటి వస్తావా?` అనే చిత్రంలో ధనశ్రీ నటిస్తోంది. డ్యాన్స్ బేస్డ్ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అష్నీర్ గ్రోవర్ రియాలిటీ షో `రైజ్ అండ్ ఫాల్`లోను ధనశ్రీ పార్టిసిపెంట్. ఈ సిరీస్ అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రీమియర్ అవుతుంది.