సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే వార్తలు కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ రాజ్-సమంత ఇద్దరూ ఈ విషయంలో ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటున్నారు. సమంత పదే పదే రాజ్ నిడమోరు తో కనిపించడం అనుమానాలకు తావిస్తుంది.
తాజాగా మరోసారి సమంత దుబాయ్ లో కనిపించింది. అంతేకాదు ఎవరిదో చేతిలో చెయ్యేసి కనిపించడంతో ఆమె దుబాయ్ లో రాజ్ నిడమోరు తో కలిసి ఉంది. ఆ విషయం ఆమె చెప్పకనే చెప్పేసింది ఈ వీడియో తో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సమంత దుబాయ్ లో ఉంది.
అక్కడి నుంచే ఆమె ఇన్స్టా లో కొన్ని వీడియోస్ షేర్ చేసింది. ఆ వీడియో లో ఆమె నవ్వుతూ కనిపించడమే కాదు ఆ వీడియోలో ఆమె మరో వ్యక్తి చేతిలో చెయ్యి వేసింది. ఫేస్ చూపించలేదు కానీ.. అది రాజ్ నిడమోరు చెయ్యి అని ఆమె అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఆ వీడియో కింద సమంత చాలా రోజులు తర్వాత నవ్వుతూ కనిపించింది.. అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొందరి ఆమె రాజ్ నిడమోరు తో జాలిగా దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.