పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా OG మేకర్స్ ఈరోజు ఉదయమే పవర్ ఫుల్ పోస్టర్ తో పవన్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. పవన్ స్టైలిష్ అండ్ వింటేజ్ పోస్టర్ ని చూసుకుని పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే లోపే సాయంత్రానికే OG నుంచి డబుల్ బొనాంజా అంటూ HBD OG - LOVE OMI పేరుతో పవర్ ఫుల్ గ్లింప్స్ వదిలారు.
OG గ్లింప్స్ లో విలన్ కేరెక్టర్ చేస్తోన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే బలమైన పాత్రలో ఆయన OG లో కనిపించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేతిలో కత్తితో ఫ్యాన్స్ కి పవర్ ఫుల్ ట్రీట్ ఇచ్చారు. పవన్ లుక్ కి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి.
సెప్టెంబర్ 25 న OG రాక అంటూ మేకర్స్ మరోసారి పవన్ బర్త్ డే కి రిలీజ్ డేట్ ని కన్ ఫర్మ్ చేశారు. ఇక గింప్స్ లో దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటే.. థమన్ BGM హైలేట్ అయ్యింది.