గత పదేళ్లుగా తెలంగాణకు పాలించిన కేసీఆర్ కు ఇప్పుడు అధికారం తో పాటుగా పరువు పాయే. అధికారము లేదు అనే బాధ కన్నా కుటుంబ కలహాలు కేసీఆర్ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అటు పరువు పోతుంది, ఇటు రాజకీయాల్లో తనకి చెడ్డ పేరు వస్తుంది. కారణం ఒకేఒక్కటి కేసీఆర్ కుమార్తె కవిత. కవిత కేసీఆర్ కి రాసిన లేఖ ఎంతగా సెన్సేషన్ అయ్యిందో ఇప్పుడు బావ హరీష్ రావు పై అలిగేషన్ చెయ్యడం అంతే సెన్సేషన్ అయ్యింది.
కవిత ప్రెస్ మీట్లు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ ని అల్లకల్లోలం చెయ్యడం తండ్రిని డైరెక్ట్ గా అనకుండా హరీష్ రావు ని సంతోష్ కుమార్ ని అనడం, అన్న కేటీఆర్ ఆధిపత్యాన్ని కవిత వ్యతిరేఖించడం అన్ని కెసిఆర్ కి పెద్ద తలనొప్పిగా మారాయి. నిన్న కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్ కోపంతో రగిలిపోతున్నారు.
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాల్సిందే అని పలువురు నేతలు పట్టుబడుతున్నారు. దానితో ఆమెను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటు కూతురు కారణంగా పరువు పోతుంది, అటు అధికారం లేక కేసీఆర్ విలవిల్లాడిపోతున్నారు.
పదేళ్లు ఎదురులేకుండా తెలంగాణను పాలించిన దొర కేసీఆర్ కు కూతురు కొరకరాని కొయ్యగా తయారైంది. కవిత ఇప్పుడు ఎవరెవరి పేర్లు బయటపెడుతుందో అని కేసీఆర్ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అధికారము పోయి, పరువు పోయి కేసీఆర్ పాపం ఏమైపోతారో అని బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు.