స్టార్ హీరోలు లేకపోయినా సినిమాలో కథ అంటే కంటెంట్ ఉంటే చిన్న సినిమాలైనా కోట్లు కొల్లగొడుతున్నాయి. మలయాళంలో లో బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షాదరణతో సూపర్ హిట్ అయ్యాయి. నిర్మాతలు కోట్లు గడిస్తున్నారు. చిన్న సినిమా అయినా, స్టార్స్ లేకపోయినా ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ ఉంటె చాలు.. అని చాలా సినిమాలు నిరూపించాయి.
ఇప్పుడు అదే కోవలోకి కళ్యాణి ప్రియదర్శిని కొత్త లోక చాప్టర్ 1 వస్తుంది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాత, కళ్యాణి ప్రియదర్శిని టైటిల్ రోల్ పోషించింది. ఇవేమి ప్రేక్షకులకు తెలియదు, కారణం ఎలాంటి ప్రమోషన్స్ కొత్త లోక కి లేవు. తెలుగులో నిర్మాత నాగవంశీ సితార నుంచి కొత్త లోక ని రిలీజ్ చేసారు. కానీ నాగవంశీ కూడా సినిమాని ప్రమోట్ చెయ్యలేదు.
దానితో కొత్త లోక తెలుగు పరిస్థితి ఏమిటో అనుకున్నారు. అంతేకాదు మలయాళం లో తెరకెక్కిన కొత్త లోక చిత్రం పై కూడా ఎలాంటి అంచనాలు లేవు. కానీ సినిమా విడుదలయ్యాక తెలిసింది.. దానిలో ఏముందో అనేది. స్టార్స్ లేరు అయినా ప్రేక్షకులు ఈ సినిమాని చూసేందుకు థియేటర్స్ కి వెళుతున్నారు. ఫస్ట్ వీకెండ్ లోనే 100 కోట్ల క్లబ్బులోకి అది ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీ అడుగుపెట్టడం మాములు విషయం కాదు.
ఇక తెలుగులోనూ కొత్త లోక పెరఫార్మెన్స్ సూపర్ గా ఉంది. ఇక్కడ ఈ వారం విడుదలైన చిత్రాలేవీ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోవడంతో కొత్త లోక కోసం ఆడియన్స్ క్యూ కడుతున్నారు. కంటెంట్ బలంగా ఉంటే స్టార్స్ అక్కర్లేదు అని కొత్త లోక మరోసారి నిరూపించింది. నాగవంశీ కి వార్ 2 లాంటి పెద్ద సినిమా షాకిస్తే కొత్త లోక లాంటి చిన్న సినిమా ఆదుకుంది అనే చెప్పాలి.