అనుష్క శెట్టి మరో రెండు రోజుల్లో ఘాటీ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క చేసిన ఈ చిత్రం పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో అనుష్క విశ్వరూపం చూస్తారు అంటూ మేకర్స్ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు కానీ అనుష్క మాత్రం ఘాటీ ప్రమోషన్స్ కి రాకుండా ఎస్కెప్ అయ్యింది.
మీడియా ముందుకు రాదు కానీ.. మీడియా తో ఫోన్ ఇంటర్వూస్ ఇస్తుంది అనుష్క. హీరో రానా తో అనుష్క ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ ని మేకర్స్ మీడియాకి వదలడమే కాదు.. కొంతమంది మీడియా ప్రతినిధులతో అనుష్క ఇంటర్వ్యూని ఫోన్ లోనే ప్లాన్ చేసారు. మీరు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు అనుష్క సమాధానమిచ్చింది.
ఇది నా పర్సనల్. నేను కేవలం మూవీ ప్రమోషన్స్ కి మాత్రమే కాదు, కనీసం ఫ్యామిలీ ఈవెంట్స్ కి పెళ్లిళ్లకు కూడా అటెండ్ అవడం లేదు. నాకు హెల్త్ బాలేదు అన్నప్పుడే బ్రేక్ తీసుకున్నాను, దానిని ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాను. అంతేతప్ప మరేమి లేదు. ఫ్యూచర్ లో చాలా సినిమాలు చేస్తాను, ఆ సినిమా ప్రమోషన్స్ కి వస్తాను అంటూ అనుష్క చెప్పుకొచ్చింది.