ఈరోజు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఏపీ డిప్యూటీ సీఎం అయినా తమకు మాత్రం తమ అభిమాన స్టార్ హీరోనే అంటూ పవన్ బర్త్ డే ని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి వస్తోన్న క్రేజీ క్రేజీ అప్ డేట్స్ తో తడిచి ముద్దవుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ లుక్స్ లో చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ ను విష్ చేస్తూ ప్రముఖులు ట్వీట్లు వేస్తున్నారు. అందులో పవన్ అన్న, మెగాస్టార్ చిరు వేసిన ట్వీట్ తో పాటుగా.. చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన అల్లు అర్జున్ వేసిన ట్వీట్స్ హైలెట్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి:
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.🤍
దీర్ఘాయుష్మాన్ భవ! @PawanKalyan
అల్లు అర్జున్:
Heartfelt Birthday Wishes to our Powerstar & Deputy CM @PawanKalyan garu అంటూ పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.