అనుష్క శెట్టి సినిమాల్లో నటిస్తుంది కానీ దాన్ని ప్రమోట్ చెయ్యదు, మీడియా ముందుకు వచ్చి సినిమాలను చూడమని చెప్పదు. ఆ విషయం నిశ్శబ్దం దగ్గర నుంచి మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి వరకు ఇప్పుడు ఘాటీ విషయంలోనూ అదే జరుగుతుంది. ఆమె బరువుపై ఎక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారో అని అనుష్క భయపడుతుంది
అందుకే మీడియాను తప్పించుకుని తిరుగుతుంది. అయితే మీడియా ముందు కనిపించదు కానీ.. ఆడియో లో వినిపిస్తుందట. అది కూడా భళ్లాలదేవుడు రానా తనని ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తే అనుష్క ఘాటీ ముచ్చట్లను ఫోన్ లోనే చెప్పి ప్రేక్షకులకు చేరవేస్తుందట. ఇదెంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది పక్కనపెడితే.. అనుష్క ట్రోల్స్ కి భయపడితే అసలు సినిమాల్లో నటించడం ఎందుకు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
మరి సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే ప్రమోషన్స్ అక్కర్లేదు. కానీ ఈమధ్య కాలంలో థియేటర్స్ కి జనాలను రప్పించాలంటే ప్రమోషన్స్ కీలకంగా మారాయి. అలాంటప్పుడు అనుష్క మీడియా కి దొరక్కుండా స్కిప్ చేసి ఇలా ఆడియో ఇంటర్వ్యూ ఇస్తే ఘాటీ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా.. అసలే సెప్టెంబర్ 5 న తమిళ మదరాసి, తెలుగు లిటిల్ హార్ట్స్ థియేటర్స్ లో ఘాటీ తో పోటీ పడడమే కాదు ప్రమోషన్స్ తో జోరుమీదున్నాయి.
ఇలాంటి సమయంలో అనుష్క వీడియో విజువల్స్.. అంటే ప్రెస్ మీట్ లో కనిపిస్తే ఘాటిపై ఖచ్చితంగా క్రేజ్ పెరగడం ఖాయం. కానీ అది జరగదని ఆమె అభిమానులే డిజప్పాయింట్ అవుతున్నారు.