సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే పవన్ ఫ్యాన్స్ కి పండగే పండగ. పవన్ బర్త్ డే కి కేక్ కటింగ్స్, బ్యానర్ లు కట్టి పాలాభిషేకాలు చెయ్యడమే కాదు అయన సినిమాల నుంచి వచ్చే అప్ డేట్స్ ను సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏడాది పొడుగునా ఎదురు చూస్తారు.
రేపు మంగళవారం సెప్టెంబర్ 2 న రాబోయే పవన్ కళ్యాణ్ బర్త్ డే కి సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న OG నుంచి భారీ ట్రీట్ ఉంటుంది. అది పక్కా.. సుజిత్ OG నుంచి క్రేజీ అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోపక్క హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ట్రీట్ ఇవ్వడానికి సిద్దమయ్యారు.
ఉస్తాద్ భగత్ నుంచి ఫుల్ మీల్స్ రేపు 4.45 PM కి అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ అప్ డేట్ అందించడంతో పవన్ ఫ్యాన్స్ చాలా థ్రిల్ ఫీలవుతున్నారు. మరి హరీష్ శంకర్ ఉస్తాద్ రిలీజ్ డేట్ టీజర్ ఏమైనా ప్లాన్ చేసాడేమో చూడాలి అంటూ పవన్ ఫ్యాన్స్ ఆరాటపోతున్నారు. .