శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధి లో వివాహం చేసుకోవాలనే కోరికను ఆమె పదే పదే బయటపడుతుంది. తన పుట్టిన రోజు అయినా, లేదంటే మారేదన్నా అకేషన్ అయినా ఎక్కువగా శ్రీవారి సన్నిధిలోనే కనిపిస్తుంది. వేంకటేశ్వరుడుకి ప్రత్యేక పూజలు చేసే జాన్వీ కపూర్ తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లిపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తను ఎప్పటికైనా తిరుపతిలో సెటిల్ అవ్వాలనే కోరికను మరోసారి తెలిపింది. అక్కడే శ్రీవారి చెంతనే పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలను కనాలి, రోజు ఏడుకొండల్ని దర్శించుకోవాలి, శ్రీవారి గోవింద నామాల్ని వినాలి. అరిటాకులో భోజనం చేయాలి. నా భర్త ను లుంగీలో చూడాలి అంటూ జాన్వీ కపూర్ తన ఫ్యూచర్ లైఫ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జాన్వీ కపూర్ నటించిన పరం సుందరి విడుదలైంది. ఈచిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఇక జాన్వీ కపూర్ పెద్ది చిత్రం లో రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తుంది. అంతేకాదు జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వారిరువురు కలిసి అనేకమార్లు శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు.