సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ మ్యాన్. తన వర్క్ తో ఎంతగా బిజీ అయినా.. ఫ్యామిలీకి మహేష్ తగిన సమయాన్ని కేటాయిస్తారు. కొడుకు గౌతమ్ బర్త్ డే అయినా, కుమార్తె సితార బర్త్ డే అయినా, భార్య నమ్రత బర్త్ డే అయినా చివరికి తన బర్త్ డే అయినా మహేష్ చాలా స్పెషల్ గా విదేశాల్లో ప్లాన్ చేస్తారు.
అయితే నేడు గౌతమ్ బర్త్ డే. ఆగస్టు 31 న గౌతమ్ కృష్ణ బర్త్ డే. కొడుకు బర్త్ డే కి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పిన మహేష్ ఈ బర్త్ డే కి నిన్ను మిస్ అవుతున్నా.. నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ ట్వీట్ చేసారు. కొడుకు గౌతమ్ బర్త్ డే కి తను లేకపోవడం పై మహేష్ కాస్త ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసారు.
ప్రస్తుతం మహేష్ రాజమౌళి తో కలిసి SSMB 29 షూటింగ్ లో ఉన్నారు. ఆ కారణంగానే ఆయన గౌత బర్త్ డే కి ఫ్యామిలీకి అందుబాటులో లేకపోయారు. దానితో ఆయన కాస్త ఎమోషనల్ అవుతూ కొడుకు గౌతమ్ కి విషెస్ తెలియజేసారు.