పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాను చూపించే చిత్రంగా మొదటినుంచి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కనిపిస్తుంది. అదే అభిమానుల ఆశ కూడా. హరి హార వీరమల్లు పోతేనేమి.. OG తమకు కావల్సిన స్టఫ్ ఇస్తుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. OG నుంచి ఏ అప్ డేట్ వదిలినా అది వైరల్ చేస్తున్నారు. మరోపక్క ఓవర్సీస్ లో OG బుకింగ్స్ విధ్వంశం సృష్టిస్తుంది. ఇంకోపక్క OG ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మతిపోవాల్సిందే. ఆకాశమే హద్దుగా OG ప్రీ రిలీజ్ బిజినెస్ కనిపిస్తుంది.
ఆంధ్ర 80 కోట్లు
సీడెడ్ 23 కోట్లు
నైజాం 50 కోట్లు రేంజ్ లో OG రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసినవారు OG క్రేజ్ ఈ రేంజ్ లోనా అంటూ షాకవుతున్నారు.