డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన కార్యకర్తలు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లతో కలిసి వైజాగ్ లో జగన్ ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ని సందర్శించారు. రుషికొండ ప్యాలెస్ లోని కాస్ట్లీ బెడ్ రూమ్స్, బాత్ రూమ్స్ చూసి పవన్ కళ్యాణ్ ఒకింత షాకయ్యారు. ప్రజా ధనంతో ఇలాంటి రిచ్ ప్యాలెస్ లు అవసరమా అంటూ పవన్ కల్యాణ మాట్లాడారు.
ఈ ప్యాలెస్ లు నిర్మించడానికి 450 కోట్లు అవ్వగా.. వాటి కరెంట్ బిల్లులు కోటి రూపాయల బకాయిలు పడుతున్నాయని, గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని కానీ ఇప్పుడు ఈ ప్యాలెస్ మెయింటినెన్స్ కి బోలెడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటూ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కి వివరించారు.
ఆ రిషికొండ భవనాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ మట్లాడుతూ.. ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది.. ఇక్కడి భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాలని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్ ను పరిశీలించడానికి వస్తే పోలీసులు అడ్డుకున్న విషయాన్నీ పవన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఒక ప్రయివేట్ వ్యక్తి 453కోట్లతో పెట్టుబడి పెడితే.. ఎంత ఆదాయం తీస్తాడో.. అలాంటి ఆదాయ మార్గాన్ని మనమూ వెతకాలి.. అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేసారు.