పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ పలుమార్లు వాయిదాపడి చివరికి డిసెంబర్ 5 అని అనౌన్స్ చేసారు మేకర్స్. ఆ తర్వాత డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యి జనవరిలో సంక్రాంతి ఫెస్టివల్ కి వెళుతుంది అనే టాక్ మొదలైంది. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
సంక్రాంతికి రాజా సాబ్ వస్తుంది అని మేకర్స్ ఈ వినాయక చవితి పండుగ రోజు ఎనౌన్స్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేసారు. షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యి కేవలం పాటల చిత్రీకరణలో ఉన్న రాజా సాబ్ CG వర్క్ కి సమయం పడుతుందట. అది క్వాలిటీగా వచ్చేవరకు ఈ రిలీజ్ తేదీ ఇవ్వరేమో అనే మాట సోషల్ మీడియాలో మొదలయ్యింది.
కానీ తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ రాజ్ సాబ్ రిలీజ్ తేదీపై ఊహించని అప్ డేట్ ఇచ్చి వినాయక చవితికి నిరాశపడిన అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. అది రాజా సాబ్ జనవరి 9 2026 న సంక్రాంతి పండుగ స్పెషల్ గా విడుదల చెయ్యనున్నట్టుగా చెప్పారు.
సో రాజా సాబ్ కన్ఫ్యూజన్ కి నిర్మాత విశ్వ ప్రసాద్ అలా తెరదించారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా డిసెంబర్ 5 నుంచి ఒక్క నెల వెయిట్ చేస్తే రాజా సాబ్ వచ్చేస్తుంది.