మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన ఒకేసారి అవకాశాలు రావడమంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతెయ్యాల్సిందే. కానీ ఓ హీరోయిన్ మాత్రం మోహన్ లాల్, ప్రభాస్ సరసన అవకాశం వచ్చింది అంటే నమ్మలేకపోతున్నాను, నన్ను నేను గిల్లుకుని అప్పుడే నమ్మాను అంటూ చెబుతుంది.
ఇద్దరు లెజెండ్స్ తో కలిసి పని చేశాను, వారు ఊహలకు కూడా అందని వ్యక్తులు. మీరు నమ్మరు నన్ను నేను గిల్లి చూసుకుంటాను అంటూ మలయాళీ భామ మాళవిక మోహనన్ చెబుతుంది. మాళవిక మోహనన్ మోహన్ లాల్ తో హృదయపూర్వం చిత్రంలో నటించింది. ఆ చిత్రం రేపు ఆగస్టు 28 న విడుదలకాబోతుంది. హృదయపూర్వం చిత్రంలో నేను హరిత పాత్రలో నటిస్తున్నా, నేను నా పాత్రకి బాగా కనెక్ట్ అయ్యాను.. మోహన్ లాల్ తో పని చెయ్యడమంటే అదో మధురానుభూతే అంటూ మాళవిక హృదయపూర్వం పై అంచనాలు పెంచే కామెంట్స్ చేసింది.
తనకి ఈ ఏడాది చాలా ప్రత్యేకమైంది అని మోహన్ లాల్, ప్రభాస్ లాంటి ఇద్దరు స్టార్స్ తో నటించడం ఆ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవడం నమ్మశక్యంగా లేదు అంటూ మాళవిక ప్రభాస్ రాజా సాబ్ పై, అలాగే ఆమె నటిస్తున్నా తమిళ మూవీ సర్ధార్ 2 పై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరి అక్కడ మోహన్ లాల్, ఇక్కడ ప్రభాస్ అంటే అంత ఎగ్జైట్మెంట్ ఉంటుందిలే..!