కొన్నాళ్ల క్రితం వరకు సినిమాల కోసం ఓటీటీలు సంస్థలు ఎగబడేవి. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా వాటి డిజిటల్ హక్కుల కోసం పోటీపడే ఓటీటీ లు తర్వాతర్వాత కొన్ని సినిమాలకు బడ్జెట్ కూడా స్పాన్సర్ చేస్తూ ఆయా సినిమాల రిలీజ్ తేదీలను అనౌన్స్ చేసే స్థాయికి ఓటీటీలు చేరుకున్నాయి. కొంతకాలంగా నిర్మాతలు ఓటీటీ డీల్స్ కోసం ఆరాటపడుతుంటే.. ఓటీటీ లు చెట్టెక్కి కూర్చున్నాయి. దానితో ఓటీటీలు పే ఫర్ వ్యూ రీతిలో సినిమాలను కొంటున్నాయి. గతంలోలా ఎడా పెడా సినిమాలు కొనడం లేదు.
ఈమధ్య కాలంలో కొన్ని సినిమాలు ఓటీటీ డీల్ పూర్తవ్వకుండానే థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఆ కోవలోకి మహావతార్ నరసింహ వస్తుంది. కన్నడలో యానిమేటెడ్ ఫిలిం గా తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మహావతార్ నరసింహ థియేటర్స్ లో ఇరగాడేస్తోంది. పెద్ద సినిమాలకి కూడా దారివ్వడం లేదు.
ఈ చిత్రాన్ని చాలామంది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకోవడంతో సినిమా విడుదలైన నెలరోజులకు కూడా ఆక్యుపెన్సీ తగ్గడం లేదు. 300 కోట్లు కలెక్షన్స్ కు దగ్గరైన మహావతార్ నరసింహ ఓటీటీ హక్కుల కోసం పలు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయనే వార్త ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. మహావతార్ నరసింహ పై అంచనాలు లేకపోవడంతో సినిమా విడుదలకు ముందు ఈచిత్రాన్ని ఏ ఓటీటీ సంస్థ కొనేందుకు ముందుకు రాలేదు.
కానీ ఇప్పుడు థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ మహావతార్ నరసింహ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆడియన్స్ ను చూసాక పలు ఓటీటీ సంస్థలు మహావతార్ నరసింహ ఓటీటీ డీల్ కోసం పోటీపడుతున్నాయట. చాలా కాలం తర్వాత ఓ సినిమా కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు ఇలా పోటీపడడం చూస్తున్నాం.