ఈ మధ్యన హిందీ చిత్రంతో బిగ్ ప్లాప్ అందుకున్న మృణాల్ ఠాకూర్ కి తెలుగులోనూ పెద్దగా అవకాశాలు లేవు. ఆమె ప్రస్తుతం అడివి శేష్ డెకాయిట్ చిత్రం మాత్రమే చేస్తుంది. ఈమధ్యన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. కారణం ఆమె ధనుష్ తో డేటింగ్ లో ఉంది అనే న్యూస్ ఆమెను వైరల్ చేసింది.
హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారనే వార్త విపరీతంగా పాపులర్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ నటించిన చిత్ర ప్రీమియర్స్ లో ధనుష్ కనిపించడమే కాదు, ఆమె బర్త్ డే పార్టీ లోను ధనుష్ స్పెషల్ గా కనిపించడంతో వారి మధ్యలో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కానీ మృణాల్ ఠాకూర్ ఆ వార్తలకు చెక్ పెట్టింది.
ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ తో హడావిడి చేసే మృణాల్ ఠాకూర్ తాజాగా వదిలిన బ్లాక్ అండ్ వైట్ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. జీన్స్, టాప్ వేసుకుని లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో కుర్రకారు హృదయాలను దోచేసింది. మీరు కూడా మృణాల్ న్యూ లుక్ ని ఓసారి చూసెయ్యండి.