యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒకేసారి నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎవరిని పిక్ చేసుకోవాలో తెలియక సతమతమైపోయి తెగ ఫీలైపోతారు. కానీ ఇప్పుడొక హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్-రామ్ చరణ్ తో ఒకేసారి సినిమాలు చేసే అవకాశం వస్తే మాత్రం ఇద్దరి సినిమాలను వదలను, ఆ ఇద్దరి హీరోలతో డే నైట్ షిఫ్ట్‌లలో పనిచేసి అయినా ఇద్దరి సినిమాల్లో చేస్తాను అంటూ ఆసక్తికర జవాబు ఇచ్చింది.
ఆమె ఎవరో కాదు క్యూట్ బ్యూటీ శ్రీలీల. రీసెంట్ గా ఆమె జగపతి బాబు హోస్ట్ గా వస్తోన్న జయమ్ము నిశ్చయంబురా షో కి గెస్ట్ గా వచ్చింది. ఆ షోలో శ్రీలీల తన పర్సనల్ విషయాలతో పాటుగా చాలా విషయాలను చెప్పింది. ఈ షోలో జగపతి బాబు చరణ్, ఎన్టీఆర్ లతో ఒకేసారి సినిమా అవకాశాలు వస్తే ఏం చేస్తావ్ అని అడిగితె శ్రీలీల ఏ ఒక్క హీరోను వదలను అంది.
ఆ ఇద్దరి హీరోలతో అఫర్ ఒకేసారి వస్తే డే నైట్ షిఫ్ట్‌లలో పనిచేసి అయినా ఇద్దరి సినిమాల్లో నటిస్తాను అంటూ శ్రీలీల చాలా తెలివిగా ఆన్సర్ చెప్పింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ లో మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరు అంటే సాయి పల్లవి అంది, అయితే ఇది సమంతకు చెబుదాం, ఒకసారి ఫోన్ చేద్దాం అంటూ జగపతి బాబు ఆటపట్టించారు.
ఇక మాస్ జాతరలో రవితేజతో నటిస్తూ బాగా ఎంజాయ్ చేశాను. మహేష్ బాబు పంచ్‌లు వేరే లెవెల్‌లో ఉంటాయి, ఎవరినీ వదలరు అంటూ శ్రీలీల రవితేజ, మహేష్ బాబు ల గురించి కూడా ఈ షోలో చెప్పుకొచ్చింది.