విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కలయికలో పాన్ ఇండియా మూవీ గా విడుదలైన కింగ్ డమ్ చిత్రానికి థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. విజయ్ దేవరకొండ-సత్య దేవ్ అన్నద్మములుగా కనిపించిన ఈచిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. భారీ అంచనాలు నడుమ జులై 31 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి తెలుగులో తప్ప మిగతా అన్ని భాషల్లో అనుకున్న రెస్పాన్స్ కనిపించలేదు.
ఇక థియేటర్స్ లో జులై 31 న విడుదలైన కింగ్ డమ్ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కింగ్ డమ్ డిజిటల్ రైట్స్ ని భారీ డీల్ తో అన్ని భాషల్లోనూ సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగియడంతో కింగ్ డమ్ ఓటీటీ రిలీజ్ కి సిద్దమైంది.
ఆగష్టు 27 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కింగ్ డమ్ స్ట్రీమింగ్ కి రాబోతునట్లుగా అధికారికంగా ప్రకటించారు.