బాలీవుడ్ హీరోయిన్స్ కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకోవడమే కాదు చాలా స్పీడు గా పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో అలియా భట్, దీపికా పదుకొనె, కియారా అద్వానీ పెళ్లిళ్లు అయిన వెంటనే పిల్లకు తల్లులు అయ్యారు. అలియా అయితే పెళ్ళయ్యి ఏడాది తిరగకుండానే రాహా కు జన్మనిచ్చింది. దీపికా పదుకొనె పెళ్లయ్యిన ఐదేళ్లకు తల్లయ్యింది. ఇక కియారా అద్వానీ పెళ్లయిన రెండేళ్లకు రీసెంట్ గానే పాప కు జన్మనిచ్చింది.
తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించింది. బాలీవుడ్ హీరోయిన్ గా గత కొన్నేళ్లుగా అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న ప్రియాంక చోప్రా కజిన్ పరిణితి చోప్రా రెండేళ్ల కిందనే ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన పరిణీతి-రాఘవ్ చద్దాలు 2023 సెప్టెంబర్ 14న రాజాస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ది లీలా ప్యాలస్ లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వచ్చే నెల 14తో వీరి 2వ వెడ్డింగ్ యానివర్సరీ జరగనుంది. ఇక ఈలోగానే పరిణీతి చోప్రా తను తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించింది. పెళ్లైన రెండేళ్లకు తనకు తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించింది. ఈ శుభవార్తను పరిణీతి చోప్రా ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది.