అవును ఇప్పుడు అందరి చూపు కన్నడ భామ రుక్మిణి వసంత్ పైనే. రుక్మిణి వసంత్ తెలుగులో నిఖిల్ తో చేసిన సినిమా ప్లాప్ అయినప్పటికీ.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కు ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఆమెకు పాన్ ఇండియా ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో డ్రాగన్ చిత్రంలో రుక్మిణి వసంత్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. అదే సమయంలో ఆమెకు యష్ టాక్సిక్ లో ఛాన్స్ తగిలింది.
మరోపక్క చాలా సినిమాల్లో అమ్మడు పేరు గట్టిగానే వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఆమె సినిమాలు విడుదలవుతున్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ చూపు కూడా ఆమెపైనే ఉంటుంది. తాజాగా రుక్మిణి వసంత్ నటిస్తున్న తమిళ మూవీ మదరాసి సెప్టెంబర్ 5 న విడుదల కాబోతుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లోను, మదరాసి ట్రైలర్ లోను రుక్మిణి పెరఫార్మెన్స్, ఆమె లుక్స్ ఎలా ఉన్నాయో అని చాలామంది మదరాసి ట్రైలర్ చూసేందుకు ఆసక్తిగా కనిపించారు. రుక్మిణి వసంత్ కనిపించడానికి సింపుల్ గానే ఉంటుంది కానీ.. ఆమె ఆకర్షణే ఆమెకు లక్కు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఒన్స్ మురుగదాస్-శివ కార్తికేయన్ ల మదరాసి హిట్ అయితే వాళ్లకు ఆ హిట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు కానీ రుక్మిణి రేంజ్ మాత్రం అమాంతం పెరిగిపోతుంది.