టాలీవుడ్ లో 18 రోజుల పాటు సినీ కార్మికులు చేసిన సమ్మె తో సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 18 రోజుల పాటు కొనసాగిన చర్చలతో, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ తో టాలీవుడ్ కార్మికుల సమ్మె ముగిసి యధావిధిగా షూటింగ్స్ మొదలయ్యాయి. మెగాస్టార్ చిరు సినిమా దగ్గర నుంచి, బాలయ్య సినిమా వరకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా దగ్గర నుంచి రామ్ చరణ్ సినిమా వరకు, నాని సినిమా దగ్గర నుంచి శర్వా సినిమా వరకు, ఇలా చిన్నా, పెద్ద సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి.
కానీ ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అసలే నత్తనడకన సాగుతున్న రాజా సాబ్ షూటింగ్ కి టాలీవుడ్ సమ్మె ఆటంకం కాగా.. ఇప్పుడు సమ్మె ముగిసినా రాజా సాబ్ షూటింగ్ మొదలు కాకపోవడానికి కారణం రాజా సాబ్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ పై సినీ కార్మికులు ఆగ్రహంగా ఉండడమే. నిర్మాత విశ్వ ప్రసాద్ కి కార్మికులకూ మధ్య ఇంకా సమస్య సద్దుమణగలేదు.
కార్మికుల సమస్య తో షూటింగ్స్ నిలిచిపోగా.. విశ్వప్రసాద్ మిగతా టాప్ ప్రొడ్యూసర్ లా సైలెంట్ గా ఉండకుండా సినీకార్మికుల డిమాండ్లకు తలొగ్గేదే లేదని, టాలీవుడ్ సినీ వర్కర్లలో చాలామందికి స్కిల్ లేదని కామెంట్లు చెయ్యడమే కాదు ఆయన ఫెడరేషన్‌కి లీగల్ నోటీసులు కూడా పంపారు. దానితో సమ్మె ముగిసి షూటింగ్స్ మొదలైనా విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజా షబ్ షూటింగ్ కి కార్మికులు వచ్చేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు.
దానితో మిగతా షూటింగ్స్ మొదలైనా ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. పదే పదే రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఇప్పుడు కూడా డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అవ్వబోతున్న తరుణంలో రాజా సాబ్ మరోసారి సంక్రాంతికి నుంచి కూడా వాయిదా పడే అవకాశమైతే లేకపోలేదు.