Advertisement
Google Ads BL

దుమ్మురేపుతున్న కాంతార 1 బిజినెస్


కన్నడ దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కాంతార కు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయ్యి అక్టోబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. కాంతార చాప్టర్ 1 షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో సంఘటనలు చిత్ర బృందాన్ని టెన్షన్ పెట్టాయి. 

Advertisement
CJ Advs

కాంతార 1 షూటింగ్ కోసం వేసిన సెట్ తుఫాన్ కారణంగా కుప్పకూలింది. అంతేకాదు జూనియర్ ఆర్టిస్ట్ ల బస్ బోల్తా పడడం, ఆతర్వాత కాంతార చాప్టర్ 1లో భాగమైన కపిల్, రాకేష్ పూజారి, కళాభవన్ విజులు ఒక్కొక్కరిగా పలు కారణాలతో ప్రాణాలు కోల్పోవడం, రిషబ్ శెట్టి ఉన్న పడవ మునిగిపోయి కెమెరా యూనిట్ పాడవడం వంటి సంఘటనలతో కాంతార షూటింగ్ ఫైనల్ గా పూర్తయ్యింది. 

కాంతార హిట్ అవడంతో కాంతార చాప్టర్ 1 పై భీభత్సమైన అంచనాలు పెరిగాయి. ఆ కారణంగానే కాంతార 1 ప్రీ బిజినెస్ లో దుమ్మురేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతార 1 కి ఏకంగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది అని, అటు దర్శకుడిగా, హీరోగా రిషభ్ శెట్టి కాంతార 1 కు దాదాపు రూ.100 కోట్ల వరకు పారితోషికం కింద అందుకుంటున్నాడని తెలుస్తుంది. అందులో రూ.50 కోట్లను పారితోషికంగా.. మరో రూ.50 కోట్లు లాభాల్లో వాటా రూపంలో రిషబ్ శెట్టి అందుకోబోతున్నాడని టాక్. 

కాంతార చాప్టర్ 1 ఇంకా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా ఓ రేంజ్‌లో ప్రీ బిజినెస్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంతార 1 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో కళ్లు చెదిరే ధరకు దక్కించుకుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Kantara Chapter 1 Pre-Box Office Business:

Kantara Chapter 1 breaks all records for Pre Release Business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs