నందమూరి నటసింహ బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కిస్తున్న నాలుగో చిత్రం అఖండ 2. వీరి కలయికలో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. దానితో అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 తాండవం చిత్రం తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అఖండ 2 కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.
అయితే అఖండ 2లో బాలయ్య లుక్ ఎలా ఉంటుందో, ఆయన పాత్ర ఎంత వైలెంట్ గా ఉంటుందో అనేది బాలకృష్ణ బర్త్ డే కి బోయపాటి రివీల్ చేసారు. బాలయ్య అఖండ అఘోర లుక్ ఫ్యాన్స్ నే కాదు మాస్ ఆడియెన్స్ ను కూడా ఇంప్రెస్స్ చేసింది. తాజాగా అఖండ 2 VFX పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అఖండ 2 లో 15 నిమిషాల పాటు VFX ఉంటాయని.. ఆ గ్రాఫిక్స్ అన్ని భారీ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. అఖండ 2లో గ్రాఫిక్స్ కోసం బోయపాటి ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారట. అన్నిటికన్నా మెయిన్ అఘోర పాత్ర వచ్చే విజువల్స్ అఖండ 2 తాండవంలో హైలెట్ గా ఉంటాయని చిత్ర బృందం చెబుతుంది.
అయితే అఖండ 2 సెప్టెంబర్ 25 కి వస్తుందా, లేదంటే దసరా బరి నుంచి అఖండ తాండవం తప్పుకుని OG కి హెల్ప్ చేస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.