Advertisement
Google Ads BL

సూపర్ సిక్స్.. సూపర్ హిట్


కూటమి కట్టి టీడీపీ, జనసేన, బీజేపీ లు ప్రజల లబ్ది కోసం సూపర్ సిక్స్ పథకాలను మ్యానిఫెస్టో లో ఉంచి ఎన్నికల బరిలోకి దిగారు. సూపర్ సిక్స్ పథకాలను ఇష్టపడిన ప్రజలు 2024 ఎన్నికలో కూటమి పార్టీలకు భారీ  విజయాన్ని కట్టబెట్టారు. అధికారంలోకి రావడంతోనే సూపర్ సిక్స్ పథకంలో కీలకమైన పెన్షన్స్ ను పెంచి పేద, పెద్ద లకు అందించింది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. 

Advertisement
CJ Advs

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకేమాట, ఒకే బాట గా కొనసాగుతూ.. ప్రజలకు మేలు చేసేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారు. దీపం పథకం, మెగా డిఎస్సి, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, రీసెంట్ గా మహిళకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకాలను కూటమి ప్రభుత్వం విడతల వారీగా అమలు చెయ్యడంతో ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడిని పొగడకుండా ఉండలేకపోతున్నారు . 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల నెల పెన్షన్స్ ఇచ్చేందుకు ఏదో ఒక పేద కుటుంబాన్ని ఎంచుకోవడం, ప్రజల నడుమే తిరగడం, సూపర్ సిక్స్ పథకాలు అమలుతో ప్రజల్లో మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలనే కోరిక పెరిగిపోయింది. అయితే ఈ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అవడాన్ని కూటమి ప్రభుత్వం సెలెబ్రేట్ చేసుకోనుంది. సూపర్ సిక్స్ పథకాలు-సూపర్ హిట్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో ప్రారంభించనుంది. 

కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్, నారా లోకేష్, మంత్రులు, కార్యకర్తలు, నేతలు అందరూ సూపర్ సిక్స్ పథకాలు- సూపర్ హిట్ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లనున్నారు. 

Super Six.. Super Hit:

Super Six, Super Hit Public Meet On Sept 5th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs