హిందీలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 స్పై యూనివర్స్ ని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు తెరకెక్కించగా ఈ చిత్ర తెలుగు హక్కులను సితార నిర్మాత నాగవంశీ భారీ డీల్ తో దక్కింకోగా.. వార్ 2 చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో సినిమాకి బ్రేక్ ఈవెన్ కాలేదు. దానితో వార్ 2 ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ప్లాప్ అయితే అయ్యింది నాగవంశీ పై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
అందుకే నాగవంశీ సైలెంట్ గా తన నిర్మాణ సంస్థ నుంచి రాబోయే మాస్ జాతర విషయంలో శ్రద్ద పెట్టినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆగష్టు 27 వినాయక చవితికి రావాల్సిన మాస్ జాతర వాయిదాపడింది. అఫీషియల్ ప్రకటన లేకపోయినా.. మాస్ జాతర ఆగష్టు 27 కి రావడం లేదు. సెప్టెంబర్ 12 కి అంటున్నా ఆ డేట్ కి కూడా మాస్ జాతర వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు.
కారణం మాస్ జాతర రషెస్ చూసిన తర్వాత కొన్ని సీన్స్ ని రీ షూట్ చెయ్యాలని అనుకుంటున్నారట. కొన్ని కీలక సన్నివేశాల కోసం రవితేజ, శ్రీలీలతో పాటు ఇంకొంతమంది కీలకమైన నటీనటుల డేట్స్ మళ్లీ అవసరమవడంతో వాళ్లందరి డేట్లు చూసుకొని, రీషూట్లు చేసుకుని అప్పుడే కొత్త డేట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
వార్ 2 ఎఫెక్ట్ తోనే నాగవంశీ ఈ రీ షూట్ కి రెడీ అయ్యారని, భాను భోగవరపు ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉండమని నాగవంశీ ప్రత్యేకంగా చెప్పినట్లుగా సమాచారం. సో మాస్ జాతర వచ్చే రెండు నెలల వరకు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.