మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ మలయాళంలో మోహన్ లాల్ కీలక పాత్రలో తెరకెక్కించిన దృశ్యం సస్పెన్స్ థ్రిల్లర్ గా అద్భుతమైన హిట్ అవడంతో అదే కథతో తెలుగులో వెంకీ, తమిళంలో కమల్, హిందీలో అజయ్ దేవగన్ లు దృశ్యం రీమేక్ చేసి హిట్ కొట్టారు. దృశ్యం సక్సెస్ అవడంతో జీతూ జోసెఫ్ దానికి సీక్వెల్ గా దృశ్యం 2 తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రీమేక్ చేసిన అన్ని భాషల్లో ఈ థ్రిల్లర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు దృశ్యం సీరీస్ నుంచి దృశ్యం 3 ని జీతూ జోసెఫ్-మోహన్ లాల్ అనౌన్స్ చేశారు. అయితే దృశ్యం 3 లో ఏం చూపించబోతున్నారు, ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ గానే ఉండబోతుందా అనే విషయంలో చాలామందిలో చాలా క్యూరియాసిటీ నడుస్తుంది. అయితే తాజాగా దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం 3 ఎలా ఉండబోతుందో అనేది రివీల్ చేశారు.
కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను మై బాస్, మమ్మీ అండ్ మీ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ ని తెరకెక్కించాను, దృశ్యం ఎప్పుడైతే సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిందో.. అప్పటి నుంచి ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయా. దృశ్యం సక్సెస్ అవడంతో దృశ్యం 2ని తెరకెక్కిద్దామనుకోలేదు. సీక్వెల్ చేస్తే బాగుంటుందని చేశాను. దృశ్యం 3 స్క్రిప్టు 10 పేజీలు ఎక్కువ రాయాల్సి వచ్చింది. దృశ్యం 4 ఉంటుందో, లేదో ఇప్పుడే చెప్పలేను. ఇకపై సస్పెన్స్ థ్రిల్లర్స్ చేయాలనుకోవడం లేదు. ఇకపై కొత్త ట్రై చేస్తాను అంటూ జీతూ జోసెఫ్ చెప్పుకొచ్చారు.