ఇకపై అలోచించి అడుగు వెయ్యి రాజా అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన ముద్ర వేసిన ఎన్టీఆర్ దేవర, వార్ 2, లాంటి చిత్రాలను ఒప్పుకోకుండా ఉంటె బావుండేది అనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం. వార్ 2 తో హిందీలో ఎన్టీఆర్ ముద్ర పడుతుంది అనుకుంటే.. అది వర్కౌట్ అవ్వలేదు.
వార్ 2 చిత్రం ప్లాప్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత బాధపడి ఉండేవారు కాదు కానీ.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కేరెక్టర్ పై, ఆయన లుక్స్ పై వస్తున్న విమర్శలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. హృతిక్ రోషన్ విషయం వదిలేసి అందరూ ఎన్టీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు అసలు కారణం.
హిందీ మార్కెట్ మీద మోజు పడితే సరిపోదు, అసలు బ్రహ్మాస్త్ర చూసాక అయాన్ ముఖర్జీతో వార్ 2 ఎందుకు చేసావ్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉన్నాడంటే ఒప్పేసుకుంటారా అంటూ చాలామంది ఎన్టీఆర్ డెసిషన్ ని తప్పు పడుతున్నారు. అంతేకాకుండా అభిమానులు ముందు కాలర్ ఎగరెయ్యడం, ఆ తర్వాత సినిమా వర్కౌట్ అవ్వకపోవడంతో ఎన్టీఆర్ ఆ కాలర్ ఎగరెయ్యడంపై ట్రోల్స్ ఇవన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నాయి.
అందుకే ఇకపై అలోచించి స్టెప్ వెయ్యి రాజా అంటూ ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.