ఆగష్టు 14 న థియేటర్స్ లో భారీ హైప్ నడుమ పోటీపడిన రెండు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ వార్ 2, కూలి చిత్రాలు రెండో వారంలోకి ఎంటర్ అయ్యాయి కానీ.. ఎక్కడా వార్తల్లో లేకుండా పోయాయి. ఆగస్టు 14 లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకుందామనుకున్న ఈ రెండు చిత్రాలకు కేవలం ఆ లాంగ్ వీకెండ్ వరకే ప్రేక్షకులు పరిమితం చేశారు.
కూలి vs వార్ 2 రెండు 100 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీసు దగ్గర పోటీపడ్డాయి. కానీ రెండు చిత్రాలకు కనీసం 500 కోట్లు కూడా రాలేదు. బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకుండానే నిర్మాతలకు షాకిచ్చాయి. రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. స్టార్ క్యాస్ట్ తో లోకేష్ మ్యాజిక్ చేద్దామనుకున్నాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు.
ఎన్టీఆర్-హృతిక్ కలిసి బాక్సాఫీసు షేక్ చేస్తారనుకున్నారు. అది కూడా అవ్వలేదు. మొదటి వీకెండ్ కే రెండు చిత్రాల పనైపోయింది. రెండో వారంలో ఏ సినిమా వాటికి పోటీ లేదు. కానీ ప్రేక్షకులే వార్ 2 ని, కూలి రెండు చిత్రాలను లైట్ తీసుకున్నారు. మరోపక్క మహావతార్ నరసింహ ఇంకా ఇంకా స్ట్రాంగ్ వసూళ్లు తేవడం వార్ 2, కూలి కి మైనస్ అయ్యింది. అందుకే రెండో వారంలో వార్ 2, కూలి రెండు సినిమాలు ఎక్కడా వినిపించడం లేదు, కనిపించడం లేదు.