అవును చిరు కి చిరునే పోటీ అన్నట్టుగా ఆయన లేటెస్ట్ చిత్రాల లుక్స్ ఉన్నాయి. నిన్నమొన్నటివరకు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర పై ఉన్న అనుమానాలను దర్శకుడు వసిష్ఠ మెగాస్టార్ బర్త్ డే ట్రీట్స్ తో ఆల్మోస్ట్ చెరిపేసినట్టే కనిపిస్తుంది. మొదటి టీజర్ లో VFX పై వచ్చిన విమర్శలను తుడిచేలా బర్త్ డే టీజర్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీ గా ఉన్నారు.
అంటే కాదు విశ్వంభర నుంచి మెగాస్టార్ వింటేజ్ లుక్ పోస్టర్ వదిలారు. మెగాస్టార్ చిరుకి 70 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు అనేలా విశ్వంభర లో చిరు లుక్ ఉంది. దానికి మించి అనేట్టుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు లుక్ ఉంది. టైటిల్ గ్లింప్స్ టీజర్ లో కోటు సూటు తో మెగా బాస్ ని పరిచయం చేసిన అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు నుంచి సెకండ్ లుక్ వదిలారు.
చైర్ లో కూర్చుని మెగాస్టార్ చిరు సిగరెట్ వెలిగిస్తూ వింటేజ్ స్టయిల్ లో అద్దరగొట్టేసారు. అటు విశ్వంభర లో చిరు డాన్స్ లుక్, ఇటు మన శంకర వరప్రసాద్ గారు సిగరెట్ లుక్ చూసాక.. చిరు కి ఎవరు పోటీ రారు, చిరు కి చిరునే పోటీ అంటూ మెగా అభిమానులు మనస్ఫూర్తిగా కామెంట్లు పెడుతున్నారు.