మేటి కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ బాలీవుడ్ లో వేవ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాలు కళ్లతో వలలు వేసే ఈ బ్యూటీ, ఇటీవలే అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన ఆజాద్ అనే చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
ఇంతలోనే రాషా తడానీ టాలీవుడ్ లో అడుగు పెడుతోందంటూ ప్రచారం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో రాషా కథానాయికగా నటిస్తుందని ప్రచారం సాగింది. కానీ ఈ సినిమా రకరకాల కారణాలతో వాయిదా పడింది. తదుపరి ఘట్టమనేని కుటుంబ హీరో జయకృష్ణ (రమేష్ బాబు వారసుడు) సరసన రాషా ఎంపికైందని తాజాగా లీకైంది.
ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. వైజయంతి మూవీస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించనుంది. టైటిల్ సహా ఇతర వివరాలు వెల్లడించాల్సి ఉంది.