హీరోయిన్ గా 100 కోట్లు, 300 కోట్ల క్లబ్బులోకి చేరిన మీనాక్షి చౌదరి ఆ తర్వాత లక్కీగా స్టార్ హీరోల సినిమాల్లో బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ అమ్మడు లక్కు అంతగా లేదు. మీనాక్షి చౌదరి వంక ఏ స్టార్ హీరో కానీ, యంగ్ హీరోలు కానీ చూడడం లేదు. కేవలం అనగనగ ఒక రోజు తప్ప మీనాక్షి చౌదరి చేతిలో ఒక్క సినిమా లేదు.
నాగ చైతన్య- కార్తీక్ దండు NC 24 లో అమ్మడు పేరు వినిపిస్తున్నా ఇంకా మీనాక్షి చౌదరి పేరుని ఫైనల్ చెయ్యలేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. టోక్యో లో మీనాక్షి చౌదరి బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది. బీచ్ డ్రెస్ వేయకపోయినా మీనాక్షి అందాలు మాత్రం సముద్రపు అందాలు అద్దిరిపోతున్నాయి.
మీనాక్షి చౌదరి వెకేషన్ లో సరదాగా గడపడమే కాదు.. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.