లక్కీ బ్యూటీ రష్మిక మందన్న క్రేజీ లుక్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులోను బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయిన ఈ నేషనల్ క్రష్ రష్మిక హిందీలో వరస అవకాశాలు దక్కించుకుంటూ అక్కడి హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక డేటింగ్ లో ఉంది అనే వార్తలతో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే రష్మిక తాజాగా వదిలిన పిక్ మాత్రం సూపర్ స్టైలిష్ గా ఆకట్టుకుంది. బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో మెడలో డైమండ్స్ తో రష్మిక న్యూ లుక్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, షూటింగ్స్ అంటూ హడావిడి పడుతున్న రష్మిక సినిమాల కారణంగా తను ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది.