రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 6 కోట్లు తన బంధువు వద్ద అప్పు గా తీసుకున్న దాసరి కిరణ్, ఆ డబ్బు ను వ్యూహం సినిమా కు పెట్టుబడి పెట్టారట.
ఆ తర్వాత తన డబ్బు తనకు ఇవ్వాలని అనేకసార్లు దాసరి కిరణ్ బంధువు దాసరి కిరణ్ ను అడిగినప్పటికీ అతనికి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాదు, ఆగస్టు 18 డబ్బు ఇవ్వాలని అడగగా, డబ్బు ఇవ్వకుండా తనపై హత్యాప్రయత్నం చేశారని దాసరి కిరణ్ బంధువు కిరణ్ పై ఫిర్యాదు చేసారు.
బాధితుని ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ కుమార్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు.