అవును.. ఈరోజు ఆకాశం నుంచి తోక చుక్క లేదా గ్రహ శకలం ఊడి పడే రోజు.. కచ్ఛితంగా అలాంటి ఆందోళన ఒక పెద్ద స్టార్ అభిమానుల గుండెల్లో నిక్షిప్తమై ఉంది. దానికి కారణం అతడి డెబ్యూ ప్రాజెక్ట్ విడుదలకు ముహూర్తం పెట్టడమే. ఈరోజు ప్రివ్యూ నుంచి ఎలాంటి రిపోర్టులు అందుతాయా? అనే టెన్షన్ తో గడిపేస్తున్నారు ఫ్యాన్స్ అంతా.
ఇంతకీ అతడు ఎవరు? అంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ గురించే ఇదంతా. తోక చుక్క ఊడి పడుతుందా? గ్రహశకలం భూమిని ఢీకొడుతుందో తెలీదు కానీ, కచ్ఛితంగా ఆర్యన్ నిరూపించాల్సి ఉంది. అతడు రోజుకు 18 గం.లు శ్రమించి తెరకెక్కించిన మొదటి వెబ్ సిరీస్ `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` (నెట్ ఫ్లిక్స్) ప్రీమియర్ రిపోర్ట్ మరికాసేపట్లో వస్తుందని అందరూ ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల నేపథ్యంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ రాక కోసం ప్రజలంతా ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు.
ఇందులో లక్ష్య కథానాయకుడు. హిందీ నుంచి పలువురు అగ్ర తారలు కూడా కనిపించబోతుండడంతో ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. కింగ్ ఖాన్ షారూఖ్ తన వారసుడు దర్శకుడిగా పరిచయమవుతుంటే చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాన్ అభిమానులందరిలో సందడి నెలకొంది. అందుకే ఈ తరుణంలో అతడి సిరీస్ ప్రివ్యూ షో నుంచి పాజిటివ్ టాక్ బయటకు రావాల్సి ఉంటుంది. ఏదైనా తేడా కొడితే గనుక అది ఆర్యన్ తో పాటు అతడి తండ్రికి పెద్ద నామోషీగా మారుతుంది. చాలా ప్రచారార్భాటం తరవాత వివాదాస్పద కమల్ ఆర్.ఖాన్ చెప్పిన ప్రకారం.. ఇదంతా ట్రాష్! అవ్వదనే అందరూ ఆశిస్తున్నారు.