ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడి చేసిన ఘటన రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.. సీఎం నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో రేఖ గుప్తా పై అటాక్ జరిగింది. ఓ 30 ఏళ్ళ వ్యక్తి తన సమస్యను సీఎం రేఖ గుప్తాకు చెప్పుకోవడానికి వచ్చి సీఎం రెప్పపాటు కాలంలో దాడికి తెగబడ్డాడు.
సీఎం రేఖ గుప్తపై దాడి చేసిన వ్యక్తిని.. అక్కడే ఉన్న సీఎం రక్షణ సిబ్బంది తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ మీటింగ్‌లో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎందుకు దాడికి పాల్పడ్డాడు, ఈ నిందితుడికి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
ఆ వ్యక్తి సీఎం రేఖ గుప్త చెంపలపై రెండు సార్లు కొట్టినట్లు, జుట్టు పట్టుకుని మరీ బాదినట్లు గా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందుతుడు జుట్టు పట్టి పీకడంతో.. తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఢిల్లీలో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.