హడావిడిగా కాకుండా ఆచి తూచి విడుదల తేదీలు ప్రకటిస్తున్నా.. చివరికి అనుకున్న తేదీలకు సినిమాలను విడుదల చెయ్యలేక మేకర్స్ ఆ సినిమాలను పదే పదే వాయిదాలు వేస్తూ అభిమానులను డిజప్పాయింట్ చేయడమనేది కొన్నాళ్లుగా జరుగుతూ వస్తుంది. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఏదైనా సరే ఇదే వరస.
రీసెంట్ గా హరి హర వీరమల్లు, కింగ్ డమ్, రవితేజ మాస్ జాతర, అనుష్క ఘాటీ, ఇకపై విడుదల కాబోయే కొన్ని సినిమాల విడుదల తేదీలు అలానే మారిపోయాయి, మారిపోతున్నాయి. అందులో హనుమాన్ తో అద్భుతమైన పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జ పాన్ ఇండియా ఫిలిం మిరాయ్ సెప్టెంబర్ 5 అంటూ రిలీజ్ డేట్ ఇవ్వడమే కాదు, ఈమధ్యన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
కానీ ఇప్పుడు మిరాయ్ వాయిదా తప్పదనే మాట వినబడుతుంది. అందుకే ప్రమోషన్స్ చెయ్యడం లేదు. సెప్టెంబర్ 5 న అనుష్క ఘాటీ విడుదలకు సిద్దమవుతుంది. దానితో పాటే మిరాయ్ రిలీజ్ అనుకుంటే.. తేజ సజ్జ వెనక్కి తగ్గుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. కొన్ని టెక్నీకల్ రీజన్స్ వలన మిరాయ్ సెప్టెంబర్ 5 నుంచి 12 కి వాయిదా వెయ్యబోతున్నారని అంటున్నారు.