మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విషయంలో అప్ డేట్స్ లేక మెగా ఫ్యాన్స్ నలిగిపోతున్నారు. దర్శకుడు వసిష్ఠ విశ్వంభర విషయంలో చూపించే అలసత్వం మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. వారు మాత్రం కుదురుగా ఉండలేకపోతున్నారు. విశ్వంభర విడుదల తేదీ విషయంలో ఎడ తెగని ఉత్కంఠ నడుస్తుంది.
అసలు విశ్వంభర విఎఫెక్స్ వర్క్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదా.. రేపు శుక్రవారం ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఆ రోజు విశ్వంభర అప్ డేట్ విషయంలో మేకర్స్ ఏంచెయ్యబోతున్నారు. ఆగష్టు 22 న విశ్వంభర విడుదల తేదీ ప్రకటించే టీజర్ వదులుతారా, విశ్వంభర నుంచి మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ గా ఏం రాబోతుంది అనేది మెగా ఫ్యాన్స్ కి తెలియక వారు డిజప్పాయింట్ అవుతున్నారు.
మరోపక్క దివాళి కి విశ్వంభర రిలీజ్ ఉంటుంది. ఆ తేదీని ఆగష్టు 22 న వదులుతారా..
అసలు మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ విశ్వంభర నుంచి ఉంటుందా, ఉండదా.. అదే మెగా ఫ్యాన్స్ ను ఆందోళనపరిచే ప్రశ్న. వసిష్ఠ విశ్వంభర ట్రీట్ ఇస్తే అది అప్ డేట్ గా వదిలితే మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం వస్తుంది. కానీ విశ్వంభర ట్రీట్ విషయంలో మేకర్స్ సైలెన్స్ ని మెగాఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. మరి వసిష్ఠ అదేదో రివీల్ చేస్తే వారు ఊరుకుంటారు, లేదంటే బూతులు తిడతారు.