సోషల్ మీడియాలోనే కాదు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ లు ఇప్పుడు వకుళ సిల్క్స్ పేరుతొ వస్త్ర దుకాణం తెరిచారు. అంతేకాదు ఏ మోడల్ నో, లేదంటే హీరోయిన్స్ నో తీసుకురాకుండా దివ్వెల మధురిని శారీస్ కట్టి తన వకుళ సిల్క్స్ ని తానే ప్రమోట్ చేసుకుంటుంది.
అంతేకాదు శ్రీనివాస్-మాధురి కలిసి ఈమధ్యన అరుణాచలం తో పాటుగా మరికొన్ని గుడులు గోపురాలు తిరిగి, ఆతర్వాత కూర్గ్ వెళ్లి బాగా ఎంజాయ్ చేసిన ఫొటోస్, వీడియోస్ వదిలారు. ఇక దివ్వెల మాధురి పట్టు చీర కట్టి వంటి నిండా నగలు వేసి మరీ ఫోటో షూట్స్ చేయించుకుంటూ దువ్వాడ తో కలిసి రీల్స్ చేస్తుంది అలానే ఫేమస్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ దువ్వాడ-దివ్వెల కలిసి బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది. గత సీజన్స్ లో వితిక-వరుణ్ సందేశ్ భార్య భర్తలైన జోడిగా బిగ్ బాస్ లోకి వెళ్లారు. తర్వాత సీరియల్ నటులు ఓ జంట వెళ్ళింది, అలానే ఇప్పుడు దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ బిగ్ బాస్ 9 లోకి జంటగా వెళుతున్నారనే వార్త వైరల్ అవుతుంది. అది నిజమా కదా అనేది మాత్రం కొద్దిగా వెయిట్ చేస్తే సరి.