సమంత కొన్నాళ్లుగా సినిమాలను ఒప్పుకోవడం లేదు. ఆరోగ్య కారణాల దృశ్య తను సినిమాలను ఒప్పుకోవడం లేదు అని చెప్పిన సమంత వెబ్ సీరీస్ షూటింగ్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ కూడా కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఇక నటిగానే కాదు శుభం చిత్రంతో ఆమె నిర్మాత గాను మారింది.
ప్రస్తుతం నిర్మాతగా తన రెండో సినిమా ప్లానింగ్ లో ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ చూపిస్తూ ఎప్పటికప్పుడు రచ్చ చేస్తుంది. జిమ్ వేర్ లో ముంబై లో తెగ తిరగేస్తుంది. ఇక రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ లో ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది కానీ.. దానిపై సమంత ఇప్పటివరకు రియాక్ట్ అయ్యింది లేదు.
తాజాగా సమంత గ్రాజియా ఇండియా కవర్ పేజీ పై రచ్చ చేసింది. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫొటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు గ్రాజియా ప్రకటించడమే కాదు కవర్ పేజీ పై సమంత ఫొటోస్ ప్రచురించింది. ఆ పిక్స్ లో సమంత 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులతో మెరిసిపోయింది.
అంతేకాదు సమంత తన 15 ఏళ్ళ నట ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అందరికి గుర్తుండిపోయేలా చేసారంటూ గ్రాజియా కొనియాడింది.