Advertisement
Google Ads BL

ధురంధర్ సెట్ లో ఫుడ్ పాయిజన్


బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ చిత్రం డిసెంబర్ 5 రిలీజ్ అంటూ ప్రకటించడంతో ఆ సినిమాపై ప్రస్తుతం అందరిలో ఆసక్తి ఏర్పడింది. కారణం అదే డిసెంబర్ 5 న ప్రభాస్ రాజా సాబ్ విడుదల కావడంతో డిసెంబర్ 5 బాక్సాఫీసు బరిపై అందరిలో అంచనాలు మొదలయ్యాయి.  

Advertisement
CJ Advs

అయితే తాజాగా రణ్వీర్ సింగ్ దురంధర్ సెట్ లో చిత్ర బృందానికి ఫుడ్ పాయిజన్ అయిన విషయం హాట్ టాపిక్ అయ్యింది. జమ్ముకశ్మీర్ లోని లెహ్ లో ధురంధర్ చిత్ర షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ముగిసి సెట్ లోని ఆరొందలమంది సభ్యులు నైట్ తినేందుకు సిద్ధమయ్యారని, భోజనం తిన్న కొద్ధి నిముషాలకే కొంతమందికి వాంతులు, మరికొంతమందికి కడుపునొప్పి రావడంతో అందరిని హుటాహుటిన లెహ్ లోని ఎస్ఎన్ఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స ఇప్పించారని తెలుస్తుంది. 

వాంతులు చేసుకుని, కడుపు నెప్పితో బాధపడిన అందరికి డాక్టర్స్ టెస్ట్ లు చెయ్యగా వారు తిన్న ఆహారంలో ఏదో కలిసింది అని, అందుకే అందరూ ఇబ్బంది పడ్డారని వెల్లడించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ధురంధర్ చిత్ర బృందం తిన్న ఆహారం శాంపిల్స్ ను తీసుకుని పరీక్షలకు పంపించారని తెలుస్తుంది. 

ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారంతా క్షేమంగా ఉన్నారని తెలుస్తుంది. 

Food poisoning outbreak on Dhurandhar film set:

120 crew members of Dhurandhar hospitalised after suffering from food poisoning in Ladakh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs