కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి తో ఒక సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య-వెంకీ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అయితే ఈచిత్రంలో బాలీవుడ్ సీనియర్ ఒకరు నటిస్తున్నారనే న్యూస్ వినిపిస్తుంది. అది అనిల్ కపూర్. అనిల్ కపూర్ సూర్య-వెంకీ అట్లూరి సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది.
తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి అనిల్ కపూర్ సూర్య చిత్రంలో నటించబోతున్నారనే వార్తలను ఖండించారు. అనిల్ కపూర్ మా మూవీలో నటించడం లేదు, మేము ఆయన్ని కలవడం కానీ, అసలు ఫోన్ చెయ్యడం కానీ చెయ్యలేదు. ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టాయో అర్ధం కావడం లేదు. ఇలాంటి రూమర్స్ నమ్మకండి.
మేము అధికారికంగా ఇచ్చే సమాచారం మాత్రమే షేర్ చెయ్యండి, ఈ రూమర్స్ ను కాదు అని వెంకీ అట్లూరి క్లారిటీ ఇచ్చారు. ఇంకా సూర్య సూపర్ స్టార్ అని, ఆయన తో వర్క్ చెయ్యడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ వెంకీ అట్లూరి కామెంట్స్ చేసారు.