నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ వరకు వెళ్లొచ్చిన తెలంగాణ కుర్రోడు, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ లో పునర్నవి తో కలిసి ప్రేమ ఆట ఆడిన రాహుల్ సిప్లిగంజ్ ఆతర్వాత బయట ఎప్పుడు పునర్నవి తో కలిసి కనిపించలేదు.
ఒకసారి పబ్ వ్యవహారంలో మీడియాకు హాట్ టాపిక్ గా మారిన రాహుల్ సిప్లిగంజ్ ని రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ నజరానాతో సన్మానించారు. అయితే ఉన్నట్టుండి అంటే ఆదివారం ఆగష్టు 17 న రాహుల్ సిప్లిగంజ్ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం లీకైంది. కొన్నాళ్లుగా రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య రెడ్డి ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది.
ఇప్పుడు ఆ అమ్మాయి హరిణ్య రెడ్డి తోనే రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్ధం అయ్యింది అని, అది కూడా అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ ఈ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ నిశ్చితార్ధపు ఫోటో లీకై సోషల్ మీడియాలో కనిపించగానే ఫ్రెండ్స్, సన్నిహితులు రాహుల్ సిప్లిగంజ్ జంటకు శుభాకాంక్షలు చెబుతూ హడావిడి మొదలు పెట్టేసారు.