నందమూరి నటసింహ బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తాడా అని నందమూరి అభిమానులు వెయిట్ చేసే కొద్దీ ఆ శుభ తరుణం వెనక్కి పోతూనే ఉంది. కానీ ఆ క్షణాలు మాత్రం రావడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ లోనే హీరోగా మోక్షజ్ఞ మొదటి సినిమా అనౌన్సమెంట్ వచ్చినా అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
మోక్షజ్ఞ మొదటి మూవీ అనౌన్సమెంట్ వచ్చిన కొత్తలో రెండుమూడు ఫోటో షూట్స్ లో మోక్షజ్ఞ హీరో అవతార్ లో హ్యాండ్ సమ్ గా అభిమానులు ఎలా కోరుకున్నారో అలానే కనిపించి ఆనందపరిచాడు. అయితే రీసెంట్ గా క్రిష్ దర్శకత్వం లో బాలయ్య చెయ్యబోయే ఆదిత్య 369 సీక్వెల్ నుంచి మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుంది అనే ప్రచారం జరుగుటఁది.
అలాంటి సమయంలోనే మోక్షజ్ఞ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేసాడు. మీడియాకు దూరంగా లో ప్రొఫైల్ మైంటైన్ చేసే మోక్షజ్ఞ తాజాగా కనిపించిన లుక్ మాత్రం సాంప్రదాయంగా ఉంది. ఫేస్ లో గ్లో లేకపోయినా మోక్షజ్ఞ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
అయితే మోక్షజ్ఞ బాగా సన్నబడడంతోనే ఫేస్ లో గ్లో కనిపించడం లేదు అనేది అభిమానుల వాదన. మరి ఈ వారసుడు తన మొదటి సినిమాతో ఎప్పుడు సెట్ మీదకి వేళ్తాడో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.