ప్రియాంక అరుళ్ మోహన్ కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను యంగ్ హీరోలతో నటించింది. నాని తో రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ, శర్వా తో ఒక సినిమాలో నటించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG లో హీరోయిన్ గా నటించడంతో సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం ప్రియాంక అరుల్ మోహన్ పైనే ఉంది.
అందుకే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ ను పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా ప్రియాంక అరుళ్ మోహన్ OG లుక్ ని మేకర్స్ వదిలారు. కన్మణి కేరెక్టర్ లో కూల్ గా ప్రియాంక OG లో కనిపించబోతుంది. కన్మణి లుక్ పవన్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది. ఇప్పుడు మోడ్రెన్ డ్రెస్ లో ప్రియాంక ఓ లుక్ షేర్ చేసింది.
ఆ పిక్స్ లో మెరుపుల డ్రెస్‌లో కత్తిలా కనిపించింది ప్రియాంక. గోల్డ్ కలర్ మిర్రర్ డ్రెస్ లో ప్రియాంక మోడ్రెన్ లుక్ చూసి యూత్ ఫిదా అవుతున్నారు. OG భామ కన్మణి కత్తిలా ఉందే అంటూ పవన్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ప్రియాంక మోహన్ అందాలను చూసి ఆస్వాదించండి.