సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సోషల్ మీడియా ట్వీట్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా పీఎం మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు లాంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ వేస్తోన్న ట్వీట్లు ఒక ఎత్తు.. పవన్ కళ్యాణ్ రజినీకి శుభాకాంక్షలు చెబుతూ వేసిన ట్వీట్ మరో ఎత్తు.
పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ ని విష్ చేస్తూ వేసిన ట్వీట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ సరదాగా రిప్లై ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం, నా సోదరుడు, పొలిటికల్ తుపాను పవన్ కళ్యాణ్ గారు.. ఎంతో ప్రేమతో మీరు చెప్పిన విషెస్ కు ఉప్పొంగిపోయా. దాన్ని నేను ఓ గౌరవంగా భావిస్తున్నా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు.
రజిని వేసిన ట్వీట్ కు పవన్ రిప్లై ఇస్తూ.. బిగ్ బ్రదర్ రజనీకాంత్.. మీ అభిమానం, ఆశీస్సులకు కృతజ్ఞుడిని. మీ మాటలు నా మనసుని తాకాయి. మీరు కెరీర్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా అంటూ చేసిన ట్వీట్ సరదాగా వైరల్ అవుతోంది.