లక్కీ భాస్కర్ లో సుమతిగా సాధారణ భార్య పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచేసిన మీనాక్షి చౌదరి.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో మీనాక్షి మీను గా అద్దరగొట్టెయ్యడమే కాదు.. 300 కోట్ల క్లబ్బు హీరోయిన్ గా మారిపోయింది. ఆతర్వాత ఆమెకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వస్తాయని ఆమె మాత్రమే కాదు అభిమానులు కూడా ఎక్స్ పెక్ట్ చేసారు.
కానీ మీను బేబీకి మాత్రం అవకాశాలు నిల్. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో అనగనగ ఒక రాజు చిత్రంలో నటిస్తుంది. ఆ ఒక్క ప్రాజెక్ట్ తప్ప ఆమెకు తెలుగులో మరో ప్రాజెక్ట్ లేదు. NC 24 లో మీనాక్షి చౌదరి పేరు వినిపించినా అది ఇంకా కన్ ఫామ్ అవ్వలేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి టోక్యో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.
ఆమె ఎప్పటికప్పుడు వెకేషన్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఆ ఫొటోస్ తో పాటుగా ఉదయం సూర్యుడిని ముద్దు పెట్టుకున్నట్టు, సాయంత్రం నక్షత్రాల మధ్య ఉన్నట్టు అనిపించిందని మీనాక్షి కామెంట్ చేసింది. ఆ తర్వాత రోజు టోక్యో లో షాపింగ్ చేస్తూ.. టోక్యో వీధుల్లో జాలిగా తిరుగుతున్న ఫొటోస్ షేర్ చేసింది. హ్యాపీ గా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది మీనాక్షి చౌదరి.